చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు
మైదుకూరులో ముఖ్యమంత్రి జగన్ బంధువు తిరుపాల్ రెడ్డి… అక్బర్ బాషా అనే వ్యక్తి భూమిని కబ్జా చేశాడు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో రోజుకో దుర్మార్గపు వార్త వినాల్సి వస్తోంది. కొందరు పోలీసులు సివిల్ పంచాయితీల్లో తలదూర్చడం ఎక్కువైంది.
తిరుపాల్ రెడ్డికి మద్దతుగా.. అక్బర్ ను సీఐ కొండారెడ్డి స్టేషన్ లో కూర్చోబెట్టి అతని పొలంలో దౌర్జన్యంగా నాట్లు వేయించారు. పైగా ఎన్ కౌంటర్ చేస్తానని బెదిరించారు. ఇది ముమ్మాటికీ దారుణం. న్యాయం చేయాల్సిన పోలీసులే దౌర్జన్యానికి దిగితే సామాన్యుడికి దిక్కెవరు..? గతంలో నంద్యాలలో సలీం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. అక్బర్ ఇష్యూలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.