కష్టపడి సంపాదించుకునే దారుల్ని ప్రభుత్వం మూసేస్తే, పనిలేక ఆకలి చల్లార్చుకోడానికి కొంతమంది కూలీలు ఆలయాల్లో ప్రసాదాలమీద ఆధారపడటం చూసి బాదేస్తుందన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ట్విట్టర్ వేదికగా వైసీపీ నాయకులపై ధ్వజమెత్తారు. మరికొన్ని చోట్ల మెతుకుకోసం చెత్తకుప్పల్లో వెతుకుతున్న కూలీని తలచుకుంటే కళ్ళు చెమర్చుతున్నాయన్నారు. ప్రజలను ఇలాంటి పరిస్థికి తెచ్చినందుకు వైసీపీ నాయకులు సిగ్గుపడాలన్నారు. మీరు అధికారంలోకి వచ్చి సాధించిన ఘనకార్యం ఇదేనా అని ప్రశ్నించారు. కనీసం అన్నా క్యాంటీన్ ఉన్నా ఈ పరిస్థితిలో కూలీలను ఆదుకునేది. సాకులు చెప్పకుండా వెంటనే అన్నా క్యాంటీన్ లను తెరిచి పేదలను ఆదుకోండంటూ హెచ్చరించారు.