ఊరికో వైకాపా ఇసుకాసురులు తయారయ్యారని విమర్శించారు మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు. ఇసుక కొరతపై నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇసుకవారోత్త్సవాలు చేస్తామని వైసీపీ ప్రభుత్వం చెప్పటం సిగ్గుచేటని. వైసీపీ నిర్ణయాల వల్ల ఇప్పటికే ఆరుగు చనిపోయారని ఇవ్వన్నీ కూడా వైసీపీ హత్యలే అని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు..
ఆత్మహత్యల పై మానవహక్కుల కమిషన్ లో ఫిర్యాదు చెయ్యాలని నేతలకు చూచించారు. జాతీయ స్థాయి లో దీన్ని ఎండగట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలంగాణ లో లేని ఇసుక కొరత ఇక్కడ ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఇసుక నియంత్రణ పేరుతో వైసీపీ నాయకులూ జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. పని లేని కార్మికులకు నెలకు పది వేలు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.