గుజరాత్ లో పట్టుబడ్డ డ్రగ్స్ తో విజయవాడకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు ప్రకటించినా.. విమర్శలు ఆగడం లేదు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఈ ఇష్యూపై స్పందిస్తూ… ఏపీ డ్రగ్స్ హబ్ గా మారుతోందని ఆరోపించారు. చంద్రబాబు అధ్యక్షతన పార్టీ స్ట్రాటజీ కమిటీ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారాయన.
గుజరాత్ పోర్టులో రూ.9 వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడింది. దాని అడ్రస్ విజయవాడ పేరుతో ఉడండంతో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ కామెంట్స్ చేశారు. అయితే నగర సీపీ మాత్రం ఒక్క అడ్రస్ తప్ప డ్రగ్స్ తో విజయవాడకు లింక్ లేదని చెబుతున్నారు.
ఇక సీఎం అవినీతి అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందని ఆరోపించారు చంద్రబాబు. టీడీపీ బహిష్కరించిన పరిషత్ ఎన్నికల్లో గెలిచామని వైసీపీ చంకలు గుద్దుకోవడం.. సీఎం పిచ్చికి పరాకాష్ట అంటూ సెటైర్లు వేశారు. ధైర్యం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని జగన్ కు సవాల్ విసిరారు. టీటీడీ జంబో బోర్డు ఏర్పాటుపై మాట్లాడుతూ.. తిరుమల పవిత్రతను మంట కలిపారని విమర్శలు చేశారు చంద్రబాబు.