తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ఉంటారని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన మరణించి 25 ఏళ్లయినా ఎన్టీఆర్ స్ఫూర్తి అలాగే కొనసాగుతోందని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అభిప్రాయపడ్డారు. నాన్ కాంగ్రెస్ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన వ్యక్తి ఎన్టీఆరేనన్న చంద్రబాబు.. రాజకీయాల కోసం కొందరు ఆయన్ను తెరపైకి తీసుకురావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ మెమోరియల్ కూల్చివేస్తామని కొందరు అనడం… మన సంస్కృతిని మనం కులగొట్టుకోవడమేనని హితవు పలికారు.
ఎప్పటికైనా ఎన్టీఆర్‌కి భారతరత్న ఇవ్వాల్సిందేనన్న చంద్రబాబు.. అప్పటిదాకా టీడీపీ తరపున పోరాడతామని చెప్పారు. భారతరత్నను మించి బిరుదులు ఆయనకు ఉన్నాయని తెలిపారు. త్వరలోనే ఆయన 100 జయంతి వస్తుందని.. వేడుకలని ఘనంగా నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు చంద్రబాబు.