ఏపీ సీఎం జగన్‌కు ప్రతిపక్ష నేత చంద్రబాబు సవాల్ విసిరారు. మూడు రాజధానుల అంశంపై రెఫరెండానికి సిద్ధమా అని ప్రశ్నించారు. 45 రోజుల్లో ఎవరి ప్రచారం వారు చేసుకుందామన్న చంద్రబాబు.. ఒకవేళ ప్రజలు మూడు రాజధానులకు అనుకూలంగా ఓటేస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. జగన్‌రెడ్డికి దమ్ముంటే రెఫరెండానికి సిద్ధం కావాలని అన్నారు.
అమరావతి పోరాటానికి ఏడాది పూర్తయిన సందర్భంగా రాయపూడిలో నిర్వహించిన అమరావతి జనభేరి బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు ఈ సందర్భంగా అమరావతిపై వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు.అధికారం కోసం తాను పోరాడడం లేదన్న.. పదవులు తనకు కొత్త కాదని అన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నానని, ప్రతిపక్షంలో కూడా ఉన్నామని చెప్పారు
ఒక్క చాన్స్ అంటే ప్రజలు అవకాశం ఇచ్చారని… కానీ వైసీపీ ఇదే చివరిసారి అవుతుందని ఎద్దేవా చేశారు చంంద్రబాబు. ప్రభుత్వానికి రాజధాని మహిళల శాపం కచ్చితంగా తగులుతుందని అన్నారు. ఒక సామాజిక వర్గాన్ని మందుపెట్టి.. రాజధానిని తరలించొద్దని హితవు పలికారు. జగన్ తెలివితేటలు తన దగ్గర పనిచేయవంటూ ఫైర్ అయ్యారు చంద్రబాబు.