ఏపీ సర్కార్ మూడు రాజధానుల నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఇదే విషయంపై మళ్లీ ప్రజా తీర్పు కోరాలని చాలెంజ్ చేశారు. అలా కుదరకపోతే కనీసం రెఫరెండం కోరండని అని చంద్రబాబు అన్నారు. మూడు రాజధానులే కావాలని ప్రజలు చెబితే.. తానిక ఈ విషయం గురించి మాట్లాడబోనని చెప్పారు. అలా కాకుండా ప్రజలు ఒకే రాజధాని కావాలంటే జగన్ తన నిర్ణయం మార్చుకోవాలని సూచించారు. ఇక ఏం చేస్తారో తేల్చుకోండి అంటూ జగన్‌కు చంద్రబాబు హితవు పలికారు.
మూడు రాజధానుల బిల్లులపై గవర్నర్ సంతకం చేసిన రోజు.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బ్లాక్ డేగా నిలిచిపోతుందని అన్నారు చంద్రబాబు. ఎన్నికల సమయంలో రాజధాని మార్చబోమని చెప్పి.. గెలవగానే మా ర్పు అంటూ మడమ తిప్పారని మండిపడ్డారు. రాష్ట్రానికి కావాల్సింది పరిపాలనా వికేంద్రీకరణనా లేక అభివృద్ధి వికేంద్రీకరణనా అని ప్రశ్నించారు. ఒక ప్రాంతం, కులంపై ద్వేషంతో చారిత్రక తప్పిదానికి పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.