విశాఖలో విషవాయువు లీక్ ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు మృతి చెందడం, అధిక సంఖ్యలో ఆసుప్రతిపాలు కావడంపై ఆవేదన చెందిన చంద్రబాబు ఆర్ ఆర్ వెంకటాపురంలో దుర్ఘటన బాధాకమన్నారు. మనుషులే కాదు మూగజీవాలు కూడా మృతిచెందాయని కొనఊపిరితో ఉన్న ప్రజలను, మూగజీవాలను కాపాడాలని ప్రభుత్వాన్ని అధికారులను కోరారు. చెట్లన్నీ రంగుమారడం విషవాయు తీవ్రతకు నిదర్శనమన్నారు. యుద్దప్రాతిపదికన ప్రజలందరినీ ఖాళీ చేయించాలని కోరారు. గ్యాస్ లీకై ఊళ్లు ఖాళీ చేయాల్సి రావడం బాధాకరమన్నారు. బాధితులను తక్షణమే ఆదుకోవాలి. అత్యున్నత వైద్య సాయం అందించాలి. సహాయ చర్యలను వేగిరపర్చాలి. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు.