ఏపీ ఫైర్‌బ్రాండ్ లీడర్ ఎమ్మెల్యే రోజా రెండోసారి ఎన్నికల్లో గెలుపుకు గల కారణాలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విశ్లేషించారు. ఎమ్మెల్యేగా రోజా రెండోసారి గెలవటానికి, టీడీపీ ఓడిపోవడానికి ఒకటే కారణమన్నారు. నగరిలో టీడీపీ సీనీయర్ నేత గాలిముద్దుకృష్ణమ నాయుడు మరణం తర్వాత పార్టీకి నగరిలో సరైన లీడర్ లేకుండా పోయారన్నారు.
నగరిలో మృద్ధుకృష్ణమ మరణం తర్వాత ఆలస్యం చేయకుండా అభ్యర్థిని ప్రకటించాల్సిందని అభిప్రాయపడ్డారు. కుటుంబ సభ్యులు గొడవలు వీడి కలుస్తారేమోనని ఆలస్యం చేశానని, కానీ అదే ఓటమికి కారణమైందన్నారు. నాయకులుగా ఎదగాలనుకోవటంలో తప్పు లేదు కానీ ఆ క్రమంలో శత్రువులను తయారుచేసుకోవద్దని తెలిపారు. భానుకు మంచి భవిష్యత్ ఉందన్నారు బాబు.