గుంటూరు: సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. వరదల నియంత్రణలో వైఫల్యం చెందారని, సహాయ చర్యల్లో నిర్లక్ష్యం వహించారని, బాధితులను ఆదుకునేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా వినతి చేశారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో ప్రజలకు నష్టం చేయడాన్ని బాధితులు ప్రశ్నిస్తున్నారని అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో లంక గ్రామాల ప్రజల దుస్థితి తనను కలచివేసిందన్నారు. అరటి, పసుపు, కంద, తమలపాకు, మొక్కజొన్న, వరి, చెరకు పంటలు మునిగిపోయాయని, ఇళ్లు దెబ్బతిన్నాయని చంద్రబాబు లెటర్‌లో పేర్కొన్నారు. రైతులను వెంటనే ఆదుకోవాలని, లంక గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. గోదావరి వరదల కారణంగా నష్టం అంచనాలను త్వరితగతిన పూర్తిచేసి కేంద్రానికి పంపాలన్నారు. రుణమాఫీ 4, 5 విడతల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.