గుంటూరు లో అత్యాచారానికి గురైన బాలికను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు, అత్యాచారానికి గురైన బాలిక కుటుంబ సభ్యులను కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాలికపై అత్యాచారం బాధాకరమన్నారు. చట్టాలను తేవడమే కాదు.. అమల్లోనూ అంతే చిత్తశుద్ధి ఉండాలన్నారు చంద్రబాబు. బిల్లు ఆమోదం పొందిన రోజే ఘటన జరిగితే సీఎం ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కనీసం కలెక్టర్, ఎస్పీ ని కూడా పంపించలేదని మ్మండిపడ్డారు. బాధితురాలి కుటుంబాన్ని అన్నివిధాలుగా ప్రభుత్వం ఆదుకుని, బాలిక చదువు ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించాలన్నారు. తక్షణమే అమ్మాయి పేరిట రూ.25 లక్షలు డిపాజిట్ చేయాలనీ డిమాండ్ చేశారు.