చెన్నయ్ : మాజీ ఎంపీ శివప్రసాద్‌ను పరామర్శించేందుకు టీడీపీ నేత చంద్రబాబు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్న చెన్నయ్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ శివప్రసాద్ కుటుంబ సభ్యులను అడిగి శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. శివప్రసాద్ పరిస్థితి విషమంగా వుందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నట్టు సమాచారం. ఇలావుంటే, అపోలో ఆసుపత్రిలో మాజీ ఎంపీ శివప్రసాద్‌ను పరామర్శించిన కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు. శివప్రసాద్‌కు అత్యవసర చికిత్స కొనసాగుతోందని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ కొంత విషమంగా ఉందని చెప్పారు.