యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ అధినేత దివంగత ములాయం సింగ్ యాదవ్ పార్థివ దేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు శ్రద్దాంజలి ఘటించారు. ములాయం సింగ్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తో పాటు, ఆయన కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ములాయం సింగ్ అంత్యక్రియలను స్వగ్రామం సైఫాయిలో ఆయన కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యమ్రంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు చంద్రబాబు ఈ ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు.
అక్కడి నుంచి సైఫాయికి చంద్రబాబు వెళ్లారు. అంత్యక్రియలు ముగిశాక ఆయన తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన విజయవాడకు తిరిగు ప్రయాణమవుతారు. మరోవైపు, మలాయం యాదవ్ అంత్యక్రియలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరయ్యారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ సంతోష్ కుమార్ లు కూడా హాజరయ్యారు. ములాయం అంత్యక్రియల అనంతరం సీఎం కేసీఆర్ ఢిల్లీ చేరుకుంటారు. అక్కడ పలువురు జాతీయ నేతలను కలవనున్నట్టు సమాచారం.