ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)
మగాళ్లు లేనప్పుడు ఇళ్లకొస్తున్నారు
at
గుంటూరు: వలంటీర్లతో పెద్ద ప్రమాదం వచ్చి పడిందని అంటున్నారు టీడీపీ నేత చంద్రబాబు. జగన్ సర్కార్ ఘనంగా చెప్పుకుంటున్న వలంటీర్ వ్యవస్థపై పత్రికా విలేకరుల సమావేశంలో టీడీపీ అధినేత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ అమ్మాయిని వాంఛ తీర్చమని వలంటీర్ వేధించాడని, దానికి ఆమె ఒప్పుకోకపోవడంతో ఆ వలంటీర్ ఆమెపై దాడి చేశాడని ఇటీవల జరిగిన ఓ ఉదంతాన్ని చెప్పుకొచ్చారు. ఆ అవమానం భరించలేక ఆ మహిళ ఆత్మహత్య చేసుకుందని వివరించారు. ఇలాంటి అఘాయిత్యాలు ఇంకెన్ని చూడాలో అర్థం కావట్లేదని అన్నారు. వలంటీర్ ఉద్యోగం మీ కార్యకర్తలకు ఇవ్వమని అసలు ఎవరు అడిగారని జగన్‌ను సూటిగా ప్రశ్నించారు. ఈ ఉద్యోగంతో ఏం లాభమని నిలదీశారు. రూ.5వేలకు గోనె సంచులు మోసే ఉద్యోగం ఇచ్చి వలంటీర్ జాబ్ అంటారా? అని దుయ్యబట్టారు. బియ్యం సంచులు మోసే ఉద్యోగాలు ఇచ్చి ఏదో పెద్ద ఉద్యోగాలు ఇచ్చేసినట్లుగా కథలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఫీల్డులో వలంటీర్లేమో ఇలాంటి అకృత్యాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడంటే అప్పుడు ఇళ్లకు వెళ్లి డిస్టర్బ్ చేయడం, మగాళ్లు ఇళ్లల్లో లేనప్పుడు వెళ్లి డోర్లు కొట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి పనులు ఎంత నీచమని ప్రశ్నించారు. వీటిని చూస్తుంటే ఎంతో బాధేస్తుందన్నారు. ఆవేదన, ఆవేశం వస్తుందన్నారు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే… ఒక్కరైనా స్పందించారా?, ప్రాణమంటే లెక్కలేదా? అని ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు.