చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు
గుంటూరు జిల్లా కొప్పర్రులో మాజీ జెడ్పీటీసీ శారద ఇంటిపై దాడిని ఖండిస్తున్నాం. వైసీపీ నేతల అకృత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. శారద కుటుంబ సభ్యులకు ఫోన్ చేశా. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నా. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పా.
కొప్పర్రులో వైసీపీ కార్యకర్తలు భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు నిర్వహిస్తూ.. టీడీపీ నేతల ఇళ్ల సమీపంలోకి రాగానే గొడవ మొదలుపెట్టారు. ఇళ్లముందు కూర్చుని ఉన్న టీడీపీ వర్గీయులపై రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం తలెత్తింది. వంద మంది వరకు వైసీపీ వర్గీయులు మాజీ జెడ్పీటీసీ శారద ఇంటిపై దాడికి దిగారు. రాళ్లతో కిటికీలు, తలుపులు పగలగొట్టారు. ఇంటి ముందున్న ఆరు ద్విచక్ర వాహనాలకు నిప్పుపెట్టారు. డీజిల్, కిరోసిన్ పోసి ఇంట్లో ఉన్నవారిని కూడా బయటకు రాకుండా చేయాలని ప్రయత్నించారు. లోపల ఉన్నవారంతా గంటకుపైగా బిక్కుబిక్కుమంటూ గడిపారు.