కుప్పంలో పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పంలో ఓడిపోయింది తాము కాదని… ప్రజాస్వామ్యం అని అన్నారు. అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసిందని.. ఆ పార్టీ అరాచకాలపై ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదని ఆరోపించారు. అక్రమాలు అడ్డుకోలేనప్పుడు ఎన్నికల కమిషన్ ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ నేతలు తమతో మైండ్ గేమ్ ఆడితే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు.
కుప్పంతో తనకు 35 ఏళ్ల అనుబంధం ఉందని..అక్కడి ప్రజలు తనను కుటుంబ సభ్యుడిగా భావిస్తారని చెప్పారు చంద్రబాబు. ప్రశాంతమైన కుప్పం ప్రాంతాన్ని కలుషితం చేస్తారా అని మండిపడ్డారు. పులివెందులుగా మార్చాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. కుప్పంలో కోట్ల రూపాయల డబ్బులు పంచి.. అక్రమ మార్గంలో గెలిచారని ఆరోపించారు చంద్రబాబు.