విజయవాడ : చంద్రబాబు కూడా లోకేష్ స్కూల్లోకి వచ్చేశారు. జగన్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రెస్ కాన్ఫరెన్సులు వగైరా వగైరా అనవసరమని ఫిక్సయినట్టున్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్ ఖాతాల కోసం కలాలు బయటికి తీశారు. ఇంతకుముందు కూడా ఎన్‌సీబీఎన్ సోషల్ మీడియాలో చురుగ్గానే వుండేవారు. కానీ.. ఏ సబ్జెక్టు మీద స్పందించాలనే అంశాన్ని ఆయన సమాచార వ్యవహారాలు చూసుకునే బృందం ఆ బాధ్యతలు తీసుకునేది. ఇప్పుడు డైరెక్టుగా ఇన్వాల్వ్ అవుతున్న చంద్రబాబు రోజుకో కీలక సమస్యపై తన సోషల్ మీడియా వేదికల నుంచి వాగ్బాణాలు విసురుతున్నారు. తాజాగా తెలుగు భాషా దినోత్సవం రోజున జరిగిన ఒక తప్పిదాన్ని కూడా ఆయన ప్రత్యర్ధిని వేలెత్తి చూపడానికి వాడుకున్నారు. ‘తెలుగు భాషా దినోత్సవం రోజున ప్రభుత్వం తరుఫున రూ.18 లక్షల ఖర్చు చూపిస్తున్నారు.. కానీ.. తెలుగుతల్లికి కనీసం ఒక దండ కూడా వేయలేదు.. మరి ఆ డబ్బు ఏం చేశారు.. ’ అంటూ జగన్‌ని నిలదీశారు.
తెలుగు భాషా దినోత్సవం రోజున, విజయవాడ నడిబొడ్డున ఉన్న తెలుగుతల్లి విగ్రహానికి కనీసం పూలమాల వేసేవారు కూడా లేరంటే, ఈ ప్రభుత్వం తెలుగు భాషకు ఇస్తున్న ప్రాధాన్యత అర్థమవుతుంది. తెలుగు భాషాదినోత్సవానికి ప్రభుత్వం విడుదల చేసిన రూ.18 లక్షలతో ఏం చేసినట్టు? pic.twitter.com/SfyFmejF59
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) August 30, 2019