రాజధాని కోసం ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. శనివారం మందడంలో పోలీసుల దాడిలో గాయపడిన శ్రీలక్ష్మిని చంద్రబాబు ఆయుష్ ఆసుపత్రిలో పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మహిళలపై పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వ్యాఖ్యానించారు. పోలీసులు కూడా మానవత్వంతో ఆలోచించాలన్నారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యులు ఈ ఘటనపై విచారణ చేపట్టాలని తెలిపారు. రాజధాని ప్రాంతంలో పోలీసులు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు.