ఏపీ వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడడంపై మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. కేంద్ర హోంశాఖ అధికారులతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిని వివరించి కేంద్ర బలగాల సాయం కోరారు. ఈ మేరకు బలగాలు పంపేందుకు కేంద్ర హోంశాఖ సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నాయి టీడీపీ వర్గాలు.
ఇటు ఇదే విషయంపై రాష్ట్ర గవరర్నర్ తో మాట్లాడారు చంద్రబాబు. తాజా పరిస్థితిని ఆయనకు వివరించారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబుకు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ పట్టాభిరాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి నిరసనగా వైసీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు దిగారు. టీడీపీ ఆఫీసుల ముందు నిరసన చేపట్టారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలోకి చొరబడి విధ్వంసం సృష్టించారు.
ఇక హిందూపురంలో టీడీపీ ఆఫీస్ ఎదుట వైసీపీ శ్రేణులు ధర్నా నిర్వహించగా.. టీడీపీ నేతలు పసుపునీళ్లు చల్లి శుభ్రం చేశారు.