ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన వైద్య విద్యార్ధిని తపస్వి అంతిమయాత్రలో టీడీపీ నేతలు, వర్ల రామయ్య, నన్నపనేని రాజకుమారి, గద్దె అనురాధ, వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ… తపస్వి తల్లితండ్రులతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్‌లో మాట్లాడి ఓదార్చి దైర్యం చెప్పారన్నారు. పాలకులసేవలో తరిస్తూ పోలీస్ శాఖ శాంతిభద్రతల్ని విస్మరించబట్టే, రాష్ట్రంలో మహిళల మానప్రాణాలకు రక్షణలేకుండా పోయిందని విమర్శించారు.
ఈ ప్రభుత్వంలో ప్రేమోన్మాదుల అఘాయిత్యాలకు అంతులేకుండా పోయిందన్నారు. మొన్నటి రమ్య ఉదంతం నుంచి నిన్నటి తపస్వి హత్య వరకు ఇదే పరిస్థితి నెలకొందని తెలిపారు. ప్రేమెన్నాదులను కట్టడి చేయలేని ప్రభుత్వం ఉంటే ఎంత లేకుంటే ఎంత అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడున్నరేళ్లలో శాంతి భద్రతలపై ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించని బలహీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి శాంతిభద్రతలు సమీక్షించి… మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.