గుంటూరు: కోడెల మృతితో ఆంధ్ర రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మృతికి జగన్ సర్కార్ చేసిన టార్చర్ కారణం అని అటు టీడీపీ పార్టీ శ్రేణులు, కోడెల కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ నేపధ్యంలో ఈరోజు ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్లతో చంద్రబాబు భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించి, పార్టీ తదుపరి కార్యాచరణపై వ్యూహరచన చేస్తారు. తరువాత నేతలతో కలిసి చంద్రబాబు రాజభవన్‌కు వెళ్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలసి కోడెల ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణకు ఆదేశించాలని కోరనున్నారు. ప్రస్తుతం ఆంధ్రలో కక్ష రాజకీయాలు కొనసాగుతున్నట్టు, టీడీపీ నాయకులని అక్రమ కేసులలో ఇరికించి ఇబ్బంది పెడుతున్నారని చెప్పనున్నారు.
Tolivelugu Latest Telugu Breaking News » Viral » కోడెల మృతిపై దర్యాప్తు కోరుతూ..