అసెంబ్లీ లో ఇరుపార్టీ ల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఓ ఉద్యోగిని బాస్టర్డ్ అన్నారంటూ ఆందోళన చేస్తున్నారు. అయితే ఇదే విషయమై చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను అనని పదాన్ని సభలో సృష్టించారంటూ మండిపడ్డారు. తాను అన్నది మరొకటైతే, దాన్ని వక్రీకరించారని తెలిపారు. ప్రతిపక్ష సభ్యులను అసెంబ్లీకి రాకుండా అడ్డుకోవడమనే అప్రజాస్వామిక చర్యలకు పాల్పడింది వైసీపీ వాళ్లే. తిరిగి వాళ్ళే నేను అనని పదాన్ని అన్నట్టుగా సభలో సృష్టించారు. ఎంత కోపంలోనైనా వైసీపీ వాళ్ళలాగా నాకు సంస్కారహీనమైన భాష ఉపయోగించడం, అమర్యాదకరంగా ప్రవర్తించడం రాదు.
అలాంటి నా మీద ఇలాంటి కుట్రలు, ఆరోపణలు చేస్తే వదిలిపెట్టేది లేదు. సీఎంపై ప్రివిలీజ్ మోషన్ ఇస్తాం. 6 నెలల పాలనలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, నన్ను అసెంబ్లీలోకి రానివ్వకుండా చేసేందుకే ఈ కుట్రలు. నామీద, తెలుగుదేశంపై చేసే వైసీపీ కుట్రలను ప్రజలే తిప్పికొడతారు.