ఒకే రోజు.. ఇద్దరు నేతలు.. రెండు వేర్వేరు కార్యక్రమాలు..
వాటిని ప్రజల్లోకి పంపించే అంశంలో ఒకరు సూపర్ సక్సెస్.. మరొకరు అట్టర్ ఫ్లాప్..
ఈ కామెంట్ కూడా ప్రెస్ వాళ్లదే.. తెగ వైరల్ అవుతోంది!
చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ప్రజా సంబంధాలు, మీడియా వ్యవహారాల కోసం తన దగ్గర చాలా చిన్న బృందం పనిచేసేది. తెలుగు కోసం ఇద్దరూ లేదా ముగ్గురు, ఇంగ్లిష్ కోసం ఒకరు.. ప్రింట్, బ్రాడ్‌కాస్ట్, వెబ్‌కాస్ట్ రంగాల్లో అనుభవం వున్న చురుకైన పీఆర్వోలు తనకు ముగ్గురు చాలని చంద్రబాబు తన మీడియా సలహాదారు పరకాల దగ్గర ప్రస్తావించేవారు. అధినేత కోరిక మేరకు పరకాల ముగ్గురు, నలుగురితో చాలా చిన్న టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు.
సీన్ కట్ చేస్తే.. అసలు తనకు పబ్లిసిటీయే అవసరం లేదన్న వైసీపీ ప్రభుత్వాధినేత జగన్ మోహన్‌రెడ్డి తన సీయంవోలో ఏకంగా సాక్షి బ్రాంచ్ ఆఫీసునే ఏర్పాటు చేసుకున్నారు. క్యాబినెట్ ర్యాంకులతో ముగ్గురు మీడియా సలహాదారులు (ఒకరు మాత్రం ఢిల్లీలో వుంటారు), ఒక ఓఎస్‌డీ, మరో సీపీఆర్వో, తెలుగు కోసం ఐదుగురు పీఆర్‌వోలు, ఇంగ్లిషు కోసం మరో ఇద్దరు…ఇంతమంది కలిసి ముఖ్యమంత్రి దైనందిన ప్రజా, పత్రికా సంబంధాలు చూస్తుంటారు. సోషల్ మీడియా వ్యవహారాల కోసం వేరే వింగ్ వుందంటున్నారు. ఇలావుంటే, ఈమధ్య గోదావరి పడవ ప్రమాద బాధితులను పరామర్శించడానికి సీయం వెళ్లిన సందర్భంలో జల వనరుల మంత్రి, హోంమంత్రిలతో హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తూ ముగ్గురూ నవ్వుతూ వున్న ఫోటోగ్రాఫ్‌లను మీడియాకి పంపించి సీఎంవో మీడియా బృందం అభాసుపాలైన సంగతి తెలిసిందే. ఈరోజు వీరంతా కలిసి మరో అట్టర్ ఫ్లాఫ్ షో నిర్వహించారు..! అదేమిటనేది కింద ఫోటోల్లో మీరు చూడచ్చు..
ఇక, బలగం కాదు, బలం ముఖ్యమని విశ్వసించే టీడీపీలో ఒకే ఒక్క పీఆర్‌వో పనిచేస్తున్నారు. మీడియా వ్యవహారాలు చూసేందుకు పీఆర్వోలను నియమించుకోవాలన్న ప్రతిపాదన వస్తే అంత బడ్జెట్ ఇవ్వలేమని పక్కన పడేసిన టీడీపీ నేతలు ఇవాళ గవర్నర్‌ని కలిసి కోడెల శివప్రసాదరావును ప్రభుత్వం ఏవిధంగా వేధించిందో వివరించడానికి వెళ్లిన సందర్భంలో విజయవాడ, గుంటూరు నగరాల్లో వున్న మీడియా ప్రతినిధుల్ని వెంటబెట్టుకుని వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా గేట్‌వే హోటల్‌కి మీడియా ప్రతినిధుల్ని తీసుకెళ్లి అక్కడే వారికి ఓ రేంజ్‌లో లంచ్ పెట్టించారు. అంత ఖరీదైన హోటల్లో విందు ఇవ్వడానికి ఇదీ సందర్భం కాదని తెలిసినా మీడియా ప్రాధాన్యం తెలిసిన నేత కాబట్టి బాబు ఆదేశానుసారం ఈ ఏర్పాట్లు చేయక తప్పలేదు. అదిగో ఆ సందర్భంలో తీసిన ఛాయచిత్రమిది..!
చంద్రబాబు గవర్నర్ కలిశాక తన ప్రోగ్రాం కవరేజ్ కోసం వచ్చిన మీడియాకు విజయవాడలోని ఖరీదైన ‘గేట్ వే’లో ఏర్పాటు చేసిన భోజనం ఏర్పాట్లు ఇవి. అరవై మందికి ఆర్డర్ ఇస్తే రెండొందల మంది వచ్చారని సమాచారం. వచ్చిన మీడియా వాళ్లందరికీ భోజనాలు పెట్టిన తర్వాతనే పంపించారు.
సరిగ్గా అదే సమయంలో అక్కడ సీఎంవోలో.. వైసీపీ సర్కారు లక్షమందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలిస్తూ ఫలితాలు రిలీజ్ చేసిన కార్యక్రమం ఇది. కనీసం కెమెరాలను కూడా అలో చేయలేదు. మీడియాలో ఇంత పెద్ద ఉద్యోగాల కల్పన విషయంలో కర్టెన్‌రైజర్ స్టోరీలు కూడా సీయంవో టీమ్ నుంచి రాలేదు. దీనిపై అసలు పెద్ద హడావుడే లేదు. వైసీపీ పార్టీ వర్గాలు కూడా మీడియాను లైట్ తీసుకున్నట్టు కనిపించింది. దాంతో అక్కడ ఏం జరిగిందో మీడియాకి అధికారులు ఒక ప్రెస్ రిలీజ్ ఇస్తే మినహా తెలియదు.
అదే లక్ష మందికి చంద్రబాబు ప్రభుత్వం కనుక ఉద్యోగ అవకాశాలు కల్పించే ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వుంటే అప్పుడు కథ వేరేలా వుండేది..!