విశాఖపట్నం పరిధిలోని ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విష వాయువులు విడుదలై అయిదు కిలోమీటర్ల మేర ప్రజలు మృత్యువుతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. మరో వైపు కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న కారణంగా రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
అయితే విశాఖ జరిగిన ప్రమాదం దిగ్బ్రాంతి చెందిన చంద్రబాబు విశాఖ వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరారు. విశాఖ వెళ్లి బాధితులను పరామర్శించాలి కాబట్టి ఈ అనుమతి కోరినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్ లో ఉంటున్నారు. కేంద్రం అనుమతి ఇస్తే వెంటనే విశాఖకు చంద్రబాబు బయలుదేరానున్నారు.