దేశవ్యాప్తంగా రోజు రోజుకు పెరిగిపోతున్న ఉల్లి ధరలపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరి స్పందించారు. కిలో ఉల్లిగడ్డల ధర రూ.120 లకు అమ్మడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె..ఉల్లి ధరలతో గృహిణిగా తాను కూడా ఇబ్బంది పడుతున్నానని చెప్పారు. ఇంత ఎక్కువ ధరకు ఉల్లి ధరలను తాను ఇంత వరకు చూడలేదన్నారు. ఉల్లి ధరలను తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. హెరిటేజ్ ఫ్రెష్ లో కిలో ఉల్లిగడ్డలు రూ.200 వరకు అమ్ముతున్నారని అసెంబ్లీలో సభ్యులు ప్రస్తావించడంపై స్పందిస్తూ హెరిటేజ్ ఫ్రెష్ తో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు.