లాక్ డౌన్ లో 6 లక్షల మంది ఆకలితీర్చింది తెనాలిలోని ఓ ట్రస్ట్.! చిన్న ట్రస్ట్ యే అయినప్పటికీ వాళ్లు చేస్తున్న మంచి పనిని సోషల్ మీడియాలో గమనించిన కొంత మంది దాతలు ఈ కార్యక్రమానికి సహాయం చేయడంతో ….. లాక్ డౌన్ అయిన 120 రోజుల్లో ఈ ట్రస్ట్ దాదాపు 6 లక్షల మందికి అన్నపానీయాలను అందించింది.
తెనాలిలోని శ్రీ చంద్రశేఖర్ గురు పాదుక పీఠం అనే ట్రస్ట్ 6 లక్షల మంది ఆకలి తీర్చేందుకు 20 రోజుల్లో 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. లాక్ డౌన్ సమయంలో ఇంటి బాట పట్టిన చాలా మంది బాటసారులకు చెప్పులతో పాటు, వారి కాళ్లకు అయిన గాయాలు మాన్చేందుకు ఆయింట్మెంట్ లు సైతం పంచిపెట్టారు.27 సంవత్సరాల క్రితం విష్ణుబట్ల ఆంజనేయ స్థాపించిన ఈ ట్రస్ట్ లాక్ డౌన్ సమయంలో ప్రతిరోజూ 50 కేజీల అన్నం వండి..దాదాపు 15 ప్రాంతాల్లో పంచిపెట్టేవారట!