బెంగళూరు: జాబిలికి చేరువగా వెళ్లి జాడలేకుండా పోయిన విక్రమ్ ల్యాండర్ లోకేషన్‌ను ఇస్రో గుర్తించింది. త్వరలో ల్యాండర్‌తో సంబంధాల పునురుద్ధరణ జరిగే అవకాశముందని ఇస్రో ఛైర్మన్ శివన్ వెల్లడించారు. చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండ్ అయినట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ల్యాండర్ థర్మల్ ఇమేజ్‌ను ఆర్బిటర్ క్లిక్ చేసినట్టు గుర్తించారు. ల్యాండర్ నుంచి ఇప్పటికీ సిగ్నల్స్ అందడం లేదు. సంబంధాల పునరుద్ధరణ కోసం శాస్త్రవేత్తల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చంద్రయాన్-2 ప్రయోగంలో భాగంగా విక్రమ్ చందమామకు అత్యంత సమీపంలో వెళ్లి జాడ లేకుండాపోయింది.