ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 గుర్తుండే ఉంటుంది. రోవర్ కూలిపోయినా… ఆర్బిటర్ మాత్రం ఇంకా చందుడ్రి చుట్టూ తిరుతూనే ఉంది. తాజాగా చంద్రుడికి సంబంధించి కీలక సమాచారం పంపింది. దాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. హైడ్రాక్సిల్, నీటి జాడ ఉన్నట్లు గుర్తించారు.
ఆర్బిటర్ పంపిన ప్రాథమిక సమాచారం ఆధారంగా.. చంద్రుడిపై విస్తృత స్థాయిలో తేమ ఉనికి స్పష్టంగా ఉందని చెబుతున్నారు పరిశోధకులు. ఈ డేటాను మరింత విశ్లేషించి… చందమామపై ఖనిజ లవణాల సమ్మేళనాన్ని అవగాహన చేసుకునేందుకు ప్రయత్నించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను కరెంట్ సైన్స్ జర్నల్ ప్రచురించింది.
2019లో చంద్రయాన్-2ను ఇస్రో ప్రయోగించింది. ఇప్పటివరకూ భూమి వైపు కనపించని చంద్రుడి భాగంపై అధ్యయనం చేయడానికి ఈ మిషన్ ను అప్పట్లో లాంచ్ చేశారు. అయితే చివరి నిమిషంలో రోవర్ చంద్రుడి ఉపరితలంపై కుప్పకూలింది. అయినా.. ఆర్బిటర్ మాత్రం తిరుగుతూ కీలక సమాచారం అందిస్తోంది.