యాదాద్రి కొండపైకి మే1 నుంచి భక్తుల వాహనాలను అనుమతించాలని యాదాద్రి ఆలయ అధికారులు నిర్ణయించారు. అయితే.. కొండపైకి వచ్చే వాహనాలకు పార్కింగ్ రుసుము గంటకు రూ.500 చొప్పున వసూల్ చేయనున్నట్టు ప్రకటించారు.
గంట సమయం తర్వాత ప్రతి గంటకు అదనంగా రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. దీంతో ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. దేవస్థాన కమిటీ వెనక్కి తగ్గింది.
పార్కింగ్ ఫీజు నిబంధనల్లో అధికారులు మార్పులు చేశారు. వాహన పార్కింగ్ విషయంలో అదనపు గంటగా నిర్ణయించిన రూ.100 అదనపు రుసుము ఎత్తివేసినట్లు అధికారులు వెల్లడించారు.
కొండపైకి వెళ్లే 4 చక్రాల వాహనాల పార్కింగ్ ఫీజు రూ.500 యథాతథంగా ఉంటోందని ప్రకటించారు. దీంతో తమకు కాస్త ఊరట కలుగుతోందని అంటున్నారు యాదాద్రి భక్తులు.