అప్పట్లో హీరోయిన్ల విషయంలో దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తగా ఉండేవారు. హీరోయిన్లను బెదిరించడం, భయపెట్టి నటించాలి అని అడగడం వంటివి ఉండేవి కాదు. హీరోయిన్లతో మాట్లాడాలన్నా సరే కొందరు భయపడిన సందర్భాలు ఉన్నాయని అంటారు. ముఖ్యంగా కన్నాంబ, భానుమతి వంటి హీరోయిన్లతో మాట్లాడాలంటే భయపడేవారు. వాళ్లకు సన్నివేశాలు చెప్పాలి అంటే ఆలోచించుకుని చెప్పేవారు.
కన్నాంబ అయితే మేకప్ వేసుకునేవారు కాదు. ఏ స్టార్ హీరో సినిమా అయినా సరే మేకప్ లేకుండానే నటించేవారు ఆమె. ఇక భానుమతి విషయానికి వస్తే ఆమె షూటింగ్ టైం కి వచ్చి వెళ్ళిపోయేవారు. ఎన్టీఆర్ రోమాన్స్ సన్నివేశాల్లో నటించాలి అంటే ఆమె నో చెప్పేవారు. ప్రేమ కథలను కూడా చాలా జాగ్రత్తగా ఆమెకు ఇబ్బంది లేకుండా డిజైన్ చేసేవారు దర్శకులు. ఇలా ఒక సినిమా విషయంలో ఎన్నో మార్పులు చేసారు.
అదే ఎన్టీఆర్ వందవ సినిమా సారంగధర. ఈ సినిమాలో భానుమతి హీరోయిన్ గా నటించారు. ఈ కథను నాటకం ఆధారంగా తీసుకున్నారు. ఇందులో ఆశ్చర్యం ఏంటి అంటే హీరోగా ఉన్న రామారావును భానుమతి ప్రేమించగా… హీరోకు ఈ విషయం తెలిసే సమయానికి హీరో తండ్రిని ఆమె పెళ్లిచేసుకునే పరిస్థితి రావడం ట్విస్ట్. ఆ తర్వాత కూడా హీరో వెంట పడుతుంది. అక్కడి నుంచి హీరో వెంట మళ్ళీ పడుతుంది. ఈ కథ చెప్పడానికి భానుమతికి చెప్పడానికి పది సార్లు మార్పులు చేసారట.