ఆర్ఆర్ఆర్ తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సాధించిన రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత చెర్రీ చేయబోయే సినిమా లాక్ అయింది. ఉప్పెన వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు మెగా పవర్ స్టార్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు. రామ్ చరణ్ కున్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని యూనివర్సల్ అప్పీల్ ఉన్న కాన్సెప్ట్ తో పాన్ ఇండియా ఎంటర్ టైనర్ గా బుచ్చిబాబు ఈ పవర్ ఫుల్ సబ్జెక్ట్ ను సిద్ధం చేశాడు.
పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీ ద్వారా వెంకట సతీష్ కిలారు నిర్మాతగా సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నాడు.
అయితే.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పెద్ద ట్విస్ట్ ఉంది. నిజానికి ఇది ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా. ఉప్పెన సక్సెస్ తర్వాత ఈ లైన్ ను ముందుగా ఎన్టీఆర్ కే చెప్పాడు బుచ్చి. తారక్ కు పాయింట్ నచ్చి డెవలప్ చేయమని కూడా చెప్పాడు. అలా తారక్ కోసం బుచ్చిబాబు ఈ సినిమా ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశాడు.
కట్ చేస్తే.. తారక్ బిజీ అయిపోయాడు. అనుకున్న టైమ్ కు కొరటాల సినిమా చేయలేకపోయాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా ఉండనే ఉంది. దీంతో ఈ ప్రాజెక్టు చరణ్ వద్దకు వెళ్లింది. చెర్రీకి కూడా కథ నచ్చింది. అయితే.. తారక్ కోసం అనుకున్న సినిమా కావడంతో, ఎన్టీఆర్ తో మాట్లాడి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే చరణ్ ఈ ప్రాజెక్టులో నటించడానికి ఒప్పుకున్నాడు. అలా సినిమా సెట్ అయింది.