హనుమకొండ భీమదేవర పల్లిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. శుక్రవారం ఉదయం బీసీ కాలనీలోని కుదురుపాక రాజయ్య తెల్లవారుజామున లేచి చూడగా ఇంటి ముందు పూల చెట్టుకు తాయత్తు కట్టి కోడి తల, నల్ల బట్ట, జిల్లేడు ఆకులు , పసుపు కుంకుమ, మంత్రించిన నిమ్మకాయలు, దారాలు, కొబ్బరి కాయలు అన్ని కలిపి ఒక కసంచిలో పెట్టి క్షుద్ర పూజలు నిర్వహించినట్లు వారు తెలిపారు.
ఈ విషయం గురించి గ్రామంలో తెలియడంతో గ్రామస్థులందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అందరూ భయాందోళనకు గురయ్యారు. గుర్తు తెలియని వారు అర్థరాత్రి సమయంలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం కోసమే ఇలా చేసినట్లు రాజయ్య కుటుంబీకులు తెలిపారు.
ఇలాంటి వారి పై చర్యలకు పాల్పడుతున్న వారి పై వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.