చపాతీలు ప్రతి ఇంట్లో కామన్ వంటకం.! ఈ మద్యకాలంలో డైటింగ్ పేరుతో డిన్నర్ పేరుతో చపాతీలనే తింటున్నారు. అయితే టివీల్లో చూపించే చపాతీలు పూరీల్లా పొంగుతుంటాయి. కానీ మన ఇంట్లో చేసే చపాతీల్లో ఆ పొంగు కనిపించదు. చపాతీలు పూరీల్లా పొంగాలంటూ, స్మూత్ గా ఉండాలంటే ….చపాతీ పిండిలో ఒక చెంచా ఉప్పు కలిపితే అవి పూరీల్లా పొంగడమే కాకుండా, స్మూత్ గా ఉంటాయి.
పిండికి తగిన నీళ్లు కలిపి దానికే కాస్తంత ఉప్పును కలపాలి.. మొత్తం పిండిని ముద్దగా చేసి…దానికే చిన్న చిన్న రంధ్రాలు చేసి…వాటిలో నీటిని పోస్తూ మళ్లీ కలపాలి. అలా కలిపిన పిండి మిశ్రమాన్ని 15 నిమిషాలు పక్కన పెట్టి…. మళ్లీ ఆ పిండిని కలిపి …చిన్న చిన్న ముద్దులగా చేస్తూ …రెగ్యులర్ గా చేసే చపాతీల్లాగా చేసుకోవడమే!