మెగా పవర్ స్టార్ రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు ఆచార్య టీం సర్ ఫ్రైజ్ ఇచ్చింది. ఆచార్యలో గెస్ట్ రోల్ చేస్తున్న రాంచరణ్ ఫోటోతో పాటు మెగాస్టార్ లుక్ ను రిలీజ్ చేశారు.
ఇందులో తుపాకీ చేతబట్టి… చరణ్, చిరులు గంభీరంగా ముందుకు సాగుతున్నట్లు కనపడుతుంది. ఈ సినిమా సామాజిక అంశాల ఆధారంగా తెరకెక్కినట్లు ఇప్పటికే ప్రచారంలో ఉండగా, చిత్ర యూనిట్ అధికారికంగా దృవీకరించినట్లయింది.
ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.