జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల RRR సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కూడా కీలక పాత్రలో నటిస్తుంది.
ఇక ఈ సినిమా చేస్తున్న సమయంలో చరణ్, ఎన్టీఆర్‌లతో అలియాకు మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్లలో ఈ విషయం బయటపడింది.
బహుశా ఆలియాతో ఎన్టీఆర్ కు ఉన్న స్నేహం కారణంగానే దర్శకుడు కొరటాల ఎన్టీఆర్ తో తాను చేసే సినిమాకు అలియా ను సెలెక్ట్ చేసినట్లు అనిపిస్తుంది.
మరోవైపు చరణ్ కూడా దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చేయబోయే సినిమా కోసం అలియాను తీసుకోవాలని పట్టుబట్టాడట. ప్రస్తుతం
దర్శకుడు శంకర్‌తో చరణ్ ఆర్సీ 15 సినిమా చేస్తున్నాడు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.
మొత్తానికి అలియా తో సినిమాలు చేయటానికి ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఇంట్రెస్ట్ చూపిస్తూ కొంత ప్రాజెక్ట్ లను ప్లాన్ చేసుకుంటున్నారట. మరి ఈ బ్యూటీ చరణ్, తారక్ లకు ఏ మేర ఉపయోగపడుతుందో చూడాలి.