అసెంబ్లీ ఎన్నికల వేళ పంజాబ్ సీఎం చన్నీ బంధువు భూపిందర్ సింగ్ హనీని ఈడీ అరెస్ట్ చేయడం పంజాబ్ లో చర్చనీయాంశంగా మారింది. అక్రమ మైనింగ్ ఆరోపణలతో అధికారులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల భూపిందర్ ఇంట్లో సోదాలు జరపగా భారీగా నగదు దొరికింది. ఆ మొత్తాన్ని సీజ్ చేసి తుదపరి చర్యలు తీసుకున్నారు.
భూపిందర్ పంజాబ్ రియల్టర్స్ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నాడు. అయితే ఈ సంస్థ ద్వారా అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతూ కోట్ల రూపాయల బ్లాక్ మనీని దాచినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ ఎంటర్ అయింది. అతడిపై మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేశారు.
భూపిందర్ ఇల్లు, ఆఫీసుల్లో జనవరి 18న సోదాలు జరిపారు అధికారులు. ఆ సమయంలో రూ.8 కోట్ల వరకు క్యాష్ దొరికింది. ఈ నేపథ్యంలోనే భూపిందర్ ను అరెస్ట్ చేశారు.
ఇప్పటికే సీఎం అభ్యర్థి విషయంలో చన్నీకి సిద్దూ రూపంలో పెద్ద తలనొప్పిగా ఉంది. ఇలాంటి సమయంలో బంధువు అరెస్ట్ కావడం చిక్కుల్లో పడేసింది. భూపిందర్.. చన్నీ మరదలి కుమారుడు.