దిశ కేసులో చార్జ్‌షీట్ వేసేందుకు పోలీస్ శాఖ సమాయత్తం అవుతోంది. దిశ హత్య ఎలా జరిగింది, అత్యాచారం… నిందితులు అంశాలన్నీ పొందుపర్చబోతున్నారు. ఇప్పటికే దిశ డీఎన్‌ఏ రిపోర్ట్‌తో పాటు ఫోరెన్సిక్ నివేదికలు కూడా రావటంతో… సైబరాబాద్ పోలీసులు షాద్‌నగర్ కోర్టులో చార్జ్‌షీట్ వేయబోతున్నారు.
దాదాపు 50మందిని సాక్షులుగా చేర్చబోతున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు సీసీటీవీ ఫుటేజ్, పోస్ట్‌మార్టం నివేదిక కూడా కోర్టుకు సమర్పించబోతున్నారు.
ఈ కేసుపై ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరగుతున్న నేపథ్యంలో… పోలీసులు వేయబోయే చార్జీషీట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.