సంచలనం రేపిన అమ్నేషియా పబ్ కేసులో చార్జ్ షీట్స్ దాఖలు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. జువైనల్ కోర్టుతోపాటు నాంపల్లి కోర్టులో ఈ చార్జ్ షీట్స్ దాఖలు చేశారు. 56 రోజుల్లో ఇదంతా పూర్తి చేశారు. సాదుద్దీన్ తోపాటు ఐదుగురు మైనర్లపై అభియోగాలు నమోదు చేశారు.
మొత్తం 65 మంది సాక్షుల వాంగ్మూలం సేకరించారు పోలీసులు. 600 పేజీలతో ఈ చార్జ్ షీట్స్ వేశారు. ఎఫ్‌ఎస్‌ఎల్, డీఎన్‌ఏ, సీసీ ఫుటేజ్, ఫోన్ల రికార్డ్, మెసేజ్‌లు, ప్రొటెన్సివ్ టెస్ట్, సాంకేతిక ఆధారాలను పొందరుపరిచారు. బాలికను ట్రాప్ చేసి సామూహిక అత్యాచారం చేసినట్లు తెలిపారు.
ఉద్దేశపూర్వకంగానే బాలికను పబ్‌లో ట్రాప్ చేశారు నిందితులు. కారులో బాలికపై అత్యాచారం చేశారు. పలుకుబడి ఉపయోగించి కేసు తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారు. మే 28న ఈ ఘటన జరిగింది. నిందితులు టీఆర్‌ఎస్, ఎంఐఎం నేతల పిల్లలు.
అత్యాచార సమయంలో ఎమ్మెల్యే కుమారుడు లేడని పోలీసులు చెప్పారు. అంతకుముందు బాలికను వేధించిన కేసులో మాత్రం అరెస్ట్ చేశారు. అతనితోపాటు మరో నలుగురు మైనర్లు, ఓ మేజర్ ను అదుపులోకి తీసుకున్నారు. అందర్ని కొన్ని రోజుల పాటు రిమాండ్ లో ఉంచి విచారించారు. సాదుద్దీన్ చంచల్ గూడ జైల్లో ఉండగా.. ఐదుగురు మైనర్లు జువైనల్ హోంలో ఉంటున్నారు. తాజాగా మైనర్లకు బెయిల్ మంజూరైంది.