టాలీవుడ్‌లో స్కిన్ షో ఇప్పుడు కామన్ అయిపోయింది. నేను ఆ సీన్ చేయను, ఈ సీన్ చేయను అంటే చాన్స్ మిస్ చేసుకోవాల్సిందే. అందుకు పర్‌ఫెక్ట్ ఉదాహారణ సాయిపల్లవి. అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఉండే సాయిపల్లవి స్కిన్ షోకు చేయలేనని చెప్పటంతో… సరిలేరు నీకెవ్వరు, డియర్ కామ్రెడ్‌లాంటి సినిమాలు మిస్ చేసుకుంది. లిప్‌లాక్ సీన్‌కు కూడా సాయిపల్లవి ఒప్పుకోలేదు.
తన సినిమాలు అంతంత ఆడినా… సినిమాకు కనీసం కోటి రూపాయలు తీసుకునే సాయిపల్లవి… ఇటీవల అందాల ఆరబోతతో ఉన్న ఓ యాడ్ కోసం 2 కోట్లు ఆఫర్ చేసినా నో చెప్పిందట. ముందు నా వాల్యూస్ నాకు ఇంపార్టెంట్… నాకు డబ్బు సెకండరీ అని చెప్పిందట. అంతేకాదు… పడిపడి లేచే మనసు సినిమా నిర్మాత చెల్లించాల్సిన 40లక్షలు సినిమా సరిగ్గా ఆడనందున తనకు వద్దని చెప్పిందట. సాయిపల్లవి మంచి మనస్సు అమ్మాయి అంటూ ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలు చర్చించుకుంటున్నారు.