పూరి కనెక్ట్స్ ఛార్మి-పూరి జగన్నాథ్ కాంబినేషన్. పూరి కనెక్ట్స్‌తో కనెక్ట్ కావడమంటే చాలామందికి ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్. పూరి డైరెక్టర్ మాత్రమే కాదు ఛార్మితో కలిసి ప్రొడ్యూసర్. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్‌తో మంచి జోష్ మీద ఉన్న పూరీ, చార్మీ ఒకరికొకరు కార్లు గిఫ్ట్స్ ఇచ్చుకుని ఖుషీ చేశారు. అయితే పూరి బర్త్ డేకి ఛార్మి ఆశ్చర్యకరమైన బహుమతి ప్లాన్ చేసిందట. అంతే కాదు.. ఇస్మార్ట్ గిఫ్ట్ ఏమిటో గెస్ చేయాలని ఒక పోస్ట్ పెట్టింది.
అంటే పూరి జగన్నాథ్ అంతకుముందు చెప్పినట్టుగా ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కావచ్చు? సీక్వెల్ కి ఒక ఐడియా కూడా ఉంది. ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్‌కి సంబంధించి పూరి స్క్రిప్ట్ రెడీ చేశాడా? పూరి పుట్టినరోజున ఆ సినిమా ప్రకటన ఇస్తారా? అనేది తొలి అంచనా. దీనికి కారణం రామ్ ఇంకా తన తదుపరి సినిమా ఓకే చెయ్యలేదు. అందుకే ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ప్రకటనకే ఎక్కువ స్కోప్ ఉంది.
వరుసగా సినిమాలు కమిట్ అవుతున్న పూరి జగన్నాథ్ బాలకృష్ణకి హిట్ మూవీ బాకీని తీర్చుకోబోతున్నాడా? ఎందుకంటే పైసా వసూల్ అంతగా ఆకట్టుకోలేదు కాబట్టి ఈసారి హిట్ ఇవ్వాలనే కసి ఉంది. పూరి పుట్టినరోజుకి బాలయ్య మూవీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందనేది సెకండ్ గెస్.
ఇక థర్డ్ గెస్.. విజయ్ దేవరకొండతో 2020 ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యే ఫైటర్ సినిమాకి పూరి బర్త్ డే సందర్బంగా టీజర్ రిలీజ్ చేస్తారా? పూరితో ఫైటర్ అనే సినిమాతో ముందుగా విజయ్ దేవరకొండ మంచి ఛాన్స్ దక్కింది.
మరి ఛార్మి చెప్పిన సర్పైజ్ ఏమిటి? కచ్చితంగా ఈ మూడింటిలో ఒకటి మాత్రం ఉంటుందనేది అంచనా. ఈ మూడు గెస్‌లు కాకుండా మరేదైనా కొత్త పాయింట్ ఉంటుందా? అదేమిటి?
దర్శకుడు పూరీ జగన్నాథ్ పుట్టిన రోజు సందర్భంగా ఇస్మార్ట్ శంకర్ సినిమాని మరోసారి రిలీజ్ చేసేందుకు యూనిట్ రెడీ అయింది. ఈ విషయాన్ని సినిమా నిర్మాత్ ఛార్మీ సోషల్‌మీడియా ద్వారా తెలిపింది. హాయ్ గాయ్స్, నీ థియేటర్‌లో మళ్లీ నా బొమ్మ అంటూ ఓ వీడియోని ఛార్మీ అభిమానులతో పంచుకుంది. తెలంగాణలోని ఐదు థియేటర్లలో, ఏపీలోని ఐదు థియేటర్లలో ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.
దిల్‌షుక్ నగర్: వెంకటాద్రి
వరంగల్: లక్ష్మణ్
కరీంనగర్: తిరుమల
ఖమ్మం: ఆదిత్య
ఖాజీపేట: భవానీ
ఏపీలో థియేటర్లు
రాజమహేంద్రవరం: ఊర్వశి
కాకినాడా: దేవీ(స్క్రీన్ 3)
తిరుపతి: విఖాయత్
గుంటూరు: స్వామి
వైజాగ్: గోకుల్