ప్రభాస్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాలలో ‘ఛత్రపతి’ ఒకటి. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఛత్రిపతి 2005లో రిలీజ్ అయ్యి సంచలన విజయాన్ని నమోదు చేసిన సినిమా.
ప్రస్తుతం ప్యాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ను యాక్షన్ హీరోగా మెరుగులు దిద్దింది. అంతే కాదు మాస్ హీరోగా ప్రభాస్ క్రేజ్ రెట్టింపుచేసిన కమర్షియల్ క్లాసిక్ ఈ సినిమా.అలాంటి ఈ సినిమాను అదే టైటిల్ తో హిందీలోకి రీమేక్ చేశారు.
తెలుగులో మాస్ హీరోగా మంచి మార్కులు కొట్టేసిన బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఈ సినిమా రూపొందింది. సిక్స్ ప్యాక్ తో కనిపించడం కోసం గట్టి కసరత్తునే చేసి బెల్లంకొండ కెమెరా ముందుకు వెళ్లాడు. పెన్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి,వీవీ వినాయక్ దర్శకత్వం వహించాడు.
కొన్నిగంటల క్రితం హిందీ ఛత్రపతి టీజర్ ను రిలీజ్ చేశారు. భారీ మాస్ యాక్షన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. మే 12వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ లో మార్కెట్ పెంచుకోవాలనే శ్రీనివాస్ ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందనేది చూడాలి.