ఎన్.ఆర్.సి(నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్) అమలు చేస్తే తమ రాష్ట్రంలో సగం మంది జనాభా పౌరసత్వాన్ని నిరూపించుకోలేరని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం సగం మంది జనాభా దగ్గర పౌరసత్వం నిరూపించుకునేందుకు భూమి గాని భూమి రికార్డులు గాని లేవన్నారు. వారి పూర్వీకులంతా నిరక్షరాస్యులు….రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి బతుకుదెరువు కోసం వలస వచ్చిన వారని చెప్పారు. వారంతా వందేళ్ల కిందటి రికార్డులను ఎక్కడి నుంచి తీసుకురాగలరన్నారు. ఇది ప్రజలపై అధనపు భారం మోపడమే అన్నారు.
చొరబాటుదారులను తనిఖీ చేయడానికి చాలా సంస్థలున్నాయి. చొరబాటుదారులపై వారే చర్యలు తీసుకుంటారు. ఎందుకు అనవసరంగా సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడమన్నారు ఛత్తీస్ గఢ్ సీఎం. దక్షిణాఫ్రికాలో బ్రిటీష్ పాలకులు గుర్తింపు పథకాన్ని ప్రవేశపెడితే మహాత్మాగాంధీ తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. అలాగే తాను కూడా ఎన్.ఆర్.సి.ని వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. ఎన్.ఆర్.సి డాక్యుమెంట్ పై సంతకం చేయని మొదటి వ్యక్తిని తానే అవుతానని భూపేశ్ భగేల్ తెలిపారు.