భారత్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ, క్రీడా ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం 83. 1983లో భారత్ కు వరల్డ్ కప్ రావడంలో కీలక పాత్ర పోషించిన అప్పటి టీం ఇండియా సారధి కపిల్ దేవ్ జీవితచరిత్రను ఈ చిత్రంలో తెరక్కెక్కించారు. ఈ చిత్రంలో రణవీర్ సింగ్, దీపికా పదుకొనె కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ తో ఆసక్తిని కలించిన ఈ చిత్రం.. డిసెంబర్ 24 విడుదలకు సిద్దమైంది. అయితే, ఇప్పుడు ఈ చిత్రం చిక్కుల్లో పడింది. చిత్ర నిర్మాతలపై చీటింగ్ కేసు నమోదైంది.
Advertisements
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫైనాన్షియర్ కంపెనీ ముంబై మేజిస్ట్రేట్ కోర్టులో ’83’ నిర్మాతలపై చీటింగ్ ఫిర్యాదును దాఖలు చేసింది. విబ్రీ మీడియా తమతో ఒప్పందం చేసుకొని ఈ చిత్రం నిర్మాణానికి సుమారు 16 కోట్లు ఖర్చు చేపించిందని.. అయితే, చివరికి సినిమా హక్కుల విషయంలో మోసం చేసిందని.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫైనాన్షియర్ ఫిర్యాదులో ఆరోపించారు. ఈ చిత్ర నిర్మాతల్లో దీపిక పదుకొనె కూడా ఒకరు కావడంతో ఈ ఆమెపై కూడా కేసు నమోదైంది.