నటుడు నరేష్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. వృత్తి పరంగా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు నరేష్. ఒకానొక సమయంలో రాజేంద్ర ప్రసాద్ తో పోటీపడి నటించాడు. అయితే రియల్ లైఫ్ లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు నరేష్. మొత్తం మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు నరేష్.
అయితే ఇప్పుడు నరేష్ పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్న మూడవ భార్య రమ్యపై కేసు నమోదు అయింది. హిందూపూర్ , అనంతపురం , హైదరాబాద్ లో భారీగా డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తోంది. నిజానికి ఏడేళ్లుగా రమ్య, నరేష్ దూరంగా ఉంటున్నారు. దీనితో ఆమెపై గచ్చిబౌలి పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రమ్య రఘుపతి… ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సీనియర్ రాజకీయ నాయకుడు రఘువీరా రెడ్డి సోదరుని కుమార్తె . ఇండియాలో చదువు పూర్తి అయ్యాక ఆస్ట్రేలియాలో ఫిలిం మేకింగ్ కోర్స్ పూర్తి చేసింది. సినిమాలపై ఆసక్తితో దర్శకుడు నీలకంఠ దగ్గర నందనవనం సినిమాకి అసిస్టెంట్ గా పనిచేస్తున్నప్పడు నరేష్ తో పరిచయం ఏర్పడింది.
ఆ తర్వాత రమ్య విజయ నిర్మల దగ్గర కో డైరెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు ప్రేమ మొదలైంది. ఇరు కుటుంబాల వారిని ఒప్పించి నరేష్,రమ్య వివాహం చేసుకున్నారు.