టాలీవుడ్ యంగ్ హీరో పై పోలీసు కేసు నమోదయ్యింది. ఖరీదైన కార్లను తక్కువ ధరకు ఇప్పిస్తానని మోసానికి పాల్పడ్డ విషయంలో విస్వంత్ పై కేసు నమోదు చేశారు. విస్వంత్ దిల్ రాజు నిర్మించిన కేరింత సినిమాతో హీరో హీరోగా పరిచయంం అయ్యాడు. ఇటీవల వచ్చిన ఓ పిట్టకథ సినిమాల్లో కూడా నటించాడు.
ఈ వ్యవహారమై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. విస్వంత్ చేతిలో మోసపోయిన బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్టు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.