పరుగుల రాణి పీటీ ఉషాపై కేరళలో చీటింగ్ కేసు నమోదైంది. ఆమెపై మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్ ఫిర్యాదు చేయటంతో కోజికోడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఉషాను నమ్మి ఓ ఫ్లాట్ కొని జెమ్మా జోసెఫ్ మోసపోయినట్టు ఫిర్యాదులో నమోదైంది. కోజికోడ్ లో 46 లక్షల రూపాయల విలువ చేసే 1,012 చదరపు అడుగుల ప్లాట్ ను కొనుగోలు చేసినట్టు జెమ్మా జోసెఫ్ తెలిపింది.
ఈ ఫ్లాట్ ఉషా మధ్యవర్తిత్వంతో కొన్నానని.. వాయిదాల రూపంలో మొత్తం డబ్బు చెల్లించానని తెలిపింది. కానీ.. ఆ ఫ్లాట్ మాత్రం బిల్డర్ తనకు ఇవ్వలేదని జోసెఫ్ చెబుతోంది. ఈ విషయంలో బిల్డర్ తో పాటు.. ఉషా కూడా మోసం చేశారని ఆమె ఆరోపిస్తోంది. మొత్తం ఆరుగురిపై సెక్షన్ ఐపీసీ 420 కింద చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.