త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ హీరోగా వచ్చిన సినిమా అలవైకుంఠపురములో. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. అంతే కాకుండా అల్లుఅర్జున్ కు రికార్డు స్థాయిలో మంచి పేరును కూడా తీసుకొచ్చింది. ఇదంతా బాగానే ఉంది. అయితే అలవైకుంట పురములో కథ తనదేనంటు కృష్ణ అనే దర్శకుడు బయటకు వచ్చాడు. దీనిపై త్రివిక్రమ్ కు నోటీసులు కూడా పాముపుతానంటూ చెప్తున్నాడు. 2005 లో త్రివిక్రమ్ ను కలిసినప్పుడు ఈ కథ చెప్పా అని అంతే కాకుండా 2013 లో ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ కూడా చేసుకున్నాడట.
త్రివిక్రమ్ ను కలిసినప్పుడు కథ చెప్పి స్క్రిప్ట్ కి సంబందించిన కాపీ ని కూడా ఇచ్చానని చెప్తున్నాడు. నేను చెప్పిన కథతో అలవైకుంఠపురములో సినిమా తెరకెక్కించారని, దీనిపై త్రివిక్రమ్ కు నోటీసులు పంపుతానంటూ చెప్తున్నాడు కృష్ణ. ఇది ఇలా ఉండగా అలవైకుంఠపురములో సినిమా సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే.
Advertisements