రాజస్థాన్ కు చెందిన హవాలా ముఠా రాకెట్ ను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చేధించారు. హవాలా మనీ ట్రాన్‌ఫర్ చేస్తూ.. నకిలీ నోట్లతో మోసాలకు పాల్పడుతున్న 4గురు ముఠా సభ్యులను హైదరాబాద్, నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితులతో పాటు 72 లక్షల 50 వేల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్ అయిన వారిని కన్నయ్య లాల్, రామవతార్ శర్మ, భారత్ కుమార్, రామకృష్ణ శర్మ గా గుర్తించి కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. దీనితో పాటు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న మరో కేసును కూడా సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించారు.
4గురు నిందితులతో పాటు 20 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, మొబైల్స్, లాప్ టాప్ లను స్వాధీనం చేసుకున్నారు.హైదరాబాద్, సైఫారాబాద్ పరిధిలో 3 రోజుల్లో 23 చోరీలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
దార్ల నెమాయ్య, మందుల శంకర్, మనోజ్ కుమార్, నామాల శ్రీధర్ గా గుర్తించారు. వీరి పై గతంలో పలు కేసులు ఉన్నాయి. వీరిలో ఇద్దరు అంతరాష్ట్ర దొంగలు ఉన్నారు. వీరి పై పీడీ యాక్టు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.