యవ్వనం దాటిందంటే దాదాపు ప్రతి ఒక్కరూ తలనొప్పి సమస్య బాధపడుతుంటారు. బాల్య వయసులోనూ తలనొప్పి సమస్యలు వస్తాయి కానీ అవి చాలా అరుదుగా ఉంటాయి. కానీ యవ్వన వయసు పైబడిందంటే రకరకాల టెన్షన్ల వల్ల తల నొప్పులు మొదలవుతాయి. తలనొప్పుల్లో వివిధ రకాలు ఉంటాయి అందులో మైగ్రేన్ తలనొప్పి భరించలేమని చెబుతుంటారు. ఇక తలనొప్పిని తగ్గించుకునేందుకు టాబ్లెట్ ల మీద టాబ్లెట్ లు వేసుకుంటారు. అయితే వాటివల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది కానీ దీర్ఘకాలికంగా దుష్ప్రభావాలు ఉండే అవకాశం ఉంది.
అయితే మనం తినే ఆహారం తో కూడా తలనొప్పిని కంట్రోల్ లో ఉంచుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మనం ప్రతిరోజు తినే ఆహారంలో భాగంగా నువ్వులను చేర్చుకుంటే తలనొప్పి వచ్చే అవకాశమే లేదని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో ఉండే ఈస్ట్రోజన్ స్థాయిలను కంట్రోల్ చేస్తుందని చెబుతున్నారు.
మహిళల్లో పీరియడ్స్ సమయంలో తలనొప్పి వస్తే నువ్వులు తినడం వల్ల త్వరగా నయం అవుతుందని చెప్తున్నారు. అంతేకాకుండా నువ్వులు తినడం వల్ల నైట్రస్ ఆక్సైడ్ వృద్ధి చెంది రక్తప్రసరణ సులభతరం అవుతుందని చెబుతున్నారు. దాంతో తలనొప్పి సమస్యలు తగ్గే అవకాశం ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.