ముఖం పై మొటిమలు ఉన్నా లేదంటే మచ్చలు ఉన్నా ఎక్కడికైనా వెళ్లాలంటే మొహమాటం గా అనిపిస్తుంది. నిజానికి మొటిమలు రావడం మచ్చలు రావడం సాధారణ సమస్య. కానీ మనం దాన్ని భూతద్దంతో చూసినప్పుడు అది మనకు పెద్ద సమస్యగా కనిపిస్తుంది. దాంతో ఎక్కడికైనా వెళ్లాలంటే ఎక్కువగా ఆలోచిస్తాం. అయితే ముఖం పై ఉండే మొటిమలు మచ్చలు పోవడానికి మెడికల్ లో దొరికే క్రీములు వాడటం కంటే వంటింటి చిట్కాలు పాటించడం మేలు చేస్తుంది. కాబట్టి ఇంట్లో తయారు చేసిన ఫేస్ ప్యాక్ లతోనే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం…
ప్రతి రోజూ నిద్రపోయే ముందు మొటిమల మీద ఐస్ క్యూబ్స్ ను రాయాలి. నిద్రపోయేముందు ఐస్ క్యూబ్ లను మొటిమలపై రుద్దితే అవి తొలగిపోయే అవకాశం ఉంది. ఒక గ్లాసు నీటిలో కాస్త నిమ్మరసం కలపాలి. ఆ నిమ్మరసంలో కాటన్ ముంచి దానిని మొటిమలపై రాసి పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి.
ఆ తరవాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి. అలా చేస్తే నిమ్మకాయలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల మొటిమలు తొలగిపోతాయి. మన ఇంట్లో లభించే అలోవెరా జెల్ మొటిమలను తొలగించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలోవెరా జెల్ ను మచ్చలు, మొటిమలు ఉన్న చోట రాసి రాత్రంతా అలాగే వదిలేయాలి. ఉదయం ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.